
బంగారంలాంటి మాట.. అనసూయ నోట..
ఏయూక్యాంపస్: బంగారం కేవలం మహిళలకు అలంకరణకు ఉపకరించే ఆభరణం మాత్రమే కాదని కుటుంబాలకు ఆర్థిక భరోసాను కూడా ఇస్తుందని సినీనటి అనసూయ భరద్వాజ్ అన్నారు. బీచ్‌రోడ్డులో ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మహిళలకు బంగారు ఆభరణాలు ధైర్యాన్ని, భరోసాను కల్పిస్తాయన్నారు. కుటుంబంలో ఆర్థిక అవసరాలకు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు బంగారం ఒక విలువైన ఆసరాగా నిలుస్తుందన్నారు. ఆర్థిక అవసరాలకు, పెట్టుబడికి బంగారం ఒక మార్గంగా నిలుస్తోందన్నారు. విశాఖ నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఎప్పుడు వచ్చినా ఇక్కడ రెండు,మూడు రోజులు ఉండటానికి ఇష్టపడతానన్నారు.