
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
పత్రికా రంగంలో ఈ రోజును బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను సాక్షి వెలుగులోకి తేవడంతోనే కక్ష సాధిస్తోంది. పోలీసులతో జర్నలిస్టులను భయపెట్టే ధోరణిని విరమించుకోవాలి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రభుత్వ తీరును జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలి.
– పి.నారాయణ్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్
జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు