
చర్లపల్లి–బ్రహ్మపూర్ స్పెషల్స్ పొడిగింపు
తాటిచెట్లపాలెం : ప్రయాణికుల సౌకర్యార్ధం చర్లపల్లి–బ్రహ్మపూర్–చర్లపల్లి స్పెషల్ రైలు మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. చర్లపల్లి –బ్రహ్మపూర్ (07027) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 9, 16, 23, 30 జూన్ 6, 13, 20, 27వ తేదీల్లో (శుక్రవారం) రాత్రి 8.15 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటిరోజు(శనివారం) ఉదయం 9.25 గంటలకు దువ్వాడకు, అదేరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బ్రహ్మపూర్–చర్లపల్లి (07028) స్పెషల్ ఈ నెల 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28వ తేదీల్లో (శనివారం) సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 9.43 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు (ఆదివారం) ఉదయం 11.35 గంలకు చర్లపల్లి చేరుకుంటుంది.