రేపు లాటరీ పద్ధతిన బార్‌ కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

రేపు లాటరీ పద్ధతిన బార్‌ కేటాయింపు

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

● రాంపల్లిలో రూ.12 కోట్లతో ఏర్పాటు ● రోజుకు 200 టన్నుల వ్యర్థాల ప్రాసెసింగ్‌

అనంతగిరి: పరిగి, కొడంగల్‌ మున్సిపల్‌ పరిధిలో ఒక్కో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు లాటరీ తీయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిగిలో 36, కొడంగల్‌లో 27 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ సమక్షంలో లాటరీ తీస్తామన్నారు. దరఖాస్తుదారులు ఉదయం 9.30గంటల వరకు కలెక్టరేట్‌కు చేరుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు మొబైల్‌ ఫోన్లను హాల్‌ బయట కౌంటర్‌లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఎంట్రీ పాస్‌ కచ్చితంగా తెచ్చువాలని సూచించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్‌ సమక్షంలో లాటరీ తీసి విజేతల పేర్లు కేటాయిస్తామని తెలిపారు.

ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు

జాతీయ స్థాయి పోటీలకు 26మంది క్రీడాకారులు

పరిగి: పట్టణంలోని మినీ గ్రౌండ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న అండర్‌ –17 బాలబాలికల రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు బుధవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 260 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. 26మంది బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో అబిద్‌ అలీ(రంగారెడ్డి), దినేష్‌సింగ్‌(హైదరాబాద్‌), అబ్దుల్‌ మక్‌సిత్‌(నల్లగొండ), ఎస్‌కే అనాస్‌(నిజామాబాద్‌), కార్తీక్‌ సాయి రాథోడ్‌(హైదరాబాద్‌), హర్ష్‌(నిజామాబాద్‌), అనుదీప్‌రెడ్డి(రంగారెడ్డి), అమాన్‌సింగ్‌(నిజామాబాద్‌), మహ్మద్‌ అదిల్‌(నల్లగొండ), ఎండీ సఫ్రోజ్‌(రంగారెడ్డి), విశ్వన్హు(హైదరాబాద్‌), వివేక్‌సింగ్‌(హైదరాబాద్‌), అభినవ్‌రెడ్డి(రంగారెడ్డి), బాలికల విభాగంలో హన్షిని(రంగారెడ్డి), రితికా(రంగారెడ్డి), లక్షితా(రంగారెడ్డి), వైష్ణవిరెడ్డి(హైదరాబాద్‌), హసిని(రంగారెడ్డి), హర్షిని(రంగారెడ్డి), అఖిలారెడ్డి(రంగారెడ్డి), ప్రియాన్షిరెడ్డి(రంగారెడ్డి), నియోజాతా(నల్లగొండ), ఖ్యాతిచౌదరి(హైదరాబాద్‌), సాయి అవంతిక(హైదరాబాద్‌), నిహావైష్ణవి(నిజామాబాద్‌), అమూల్య(హైదరాబాద్‌) బంగారు పతకాలు సాధించారు. వీరు ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున ఆడనున్నట్లు వ్యాయమ ఉపాధ్యాయులు తెలిపారు.

ఎంఎంసీలో నిర్మాణ వ్యర్థాల ప్లాంట్‌

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో భవన నిర్మాణాలు, కూల్చివేతల (సీఅండ్‌డీ) నుంచి వెలువడే వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా అడ్డుకునేందుకు మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌న్‌(ఎంఎంసీ) కీలక చర్య చేపట్టింది. రాంపల్లిలో రోజుకు 200 టన్నుల సీఅండ్‌డీ వ్యర్థాలను ప్రాసెస్‌ చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌న్‌–అర్బన్‌న్‌2.0 నిధులతో పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12 కోట్లు. పీపీపీకి అర్హత సాధించే ప్రైవేటు సంస్థ ప్లాంట్‌ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది. ప్రాజెక్టు అంచనా వ్యయంలో 40 శాతం అంటే రూ.4.80 కోట్లను ఎంఎంసీ భరించనుంది. మిగిలిన 60 శాతం అంటే రూ.7.20 కోట్లను ఎంపికయ్యే ప్రైవేటు సంస్థ సమకూర్చాలి. కీసర మండలం రాంపల్లి గ్రామంలో సర్వే నంబరు 226లో ఐదు ఎకరాల స్థలాన్ని ప్లాంట్‌ కోసం గుర్తించారు. వ్యర్థాల సేకరణ కోసం కాల్‌ సెంటర్‌ లేదా హెల్ప్‌లైన్‌న్‌ ఏర్పాటు చేస్తారు. ప్లాంట్‌ నిర్మాణం, ఏర్పాటు, యంత్రాల అమరిక, సంబంధిత మౌలిక సదుపాయాల పనులను 180 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement