పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

● వీబీజీరామ్‌జీ పనులనువంద శాతం పూర్తి చేయాలి ● కలెక్టర్‌ దీపక్‌ తివారి

అనంతగిరి: సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడు వులోగా సాధించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఎంలతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు, వీబీజీరామ్‌జీ పనులను వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా అంశాలపై మండలాల వారీగా సాధించిన పురోగతిని సమీక్షించారు. పెండింగ్‌ పనులను గుర్తించి, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఫారం పాండ్స్‌, సోప్‌ కిట్స్‌ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వీఓ భవనాలు, కమ్యూనిటీ కాంప్లెక్స్‌ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, డీఆ ర్‌డీఏ శ్రీనివాస్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మిషన్‌ భగీరథ అధికారి రవి కుమార్‌, హౌ సింగ్‌ పీడీ మాతృ నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement