సాగునీరే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సాగునీరే లక్ష్యం

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

● రూ.5.71 కోట్లతో

జుంటుపల్లి కాల్వల అభివృద్ధి

● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

యాలాల: మండలంలోని జుంటుపల్లి ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. రూ.5.71 కోట్లతో కాల్వల అభివృద్ధికి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు కాల్వలను పట్టించుకోలేదని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌, సర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పురుషోత్తంరావు, సొసైటీ చైర్మన్‌, మాజీ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, సురేందర్‌రెడ్డి, మత్స్యశాఖ జిల్లా చైర్మన్‌ శ్రీధర్‌, డీసీసీ నాయకులు నర్సిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు మహిపాల్‌, భీమప్ప, ఎంపీడీఓ శ్రీనిజ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు శ్రీవాణి, శ్రీనివాస్‌, నరేష్‌, నర్సింహులు, అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు పవన్‌కుమార్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, గోవింద్‌నాయక్‌, ఖాసీం, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయం

బంట్వారం: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం కోట్‌పల్లి ఏఎంసీ చైర్‌ పర్సన్‌ రమావత్‌ అనిత, పాలక వర్గం సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరై మాట్లాడారు. మార్కెట్‌ అభివృద్ధికి పాలకవర్గం శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అంతకు ముందు మార్కెటింగ్‌ జిల్లా అధికారి స్వరణ్‌ సింగ్‌.. చైర్‌పర్సన్‌ అనిత, పాలకవవర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మర్‌ మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ బసమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రకిరణ్‌, తహసీల్దార్‌ ఆనంద్‌రావు, మార్కెట్‌ కమిటీ సెక్రటరీ సాయికుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు డాక నీలమ్మ, నాయకులు మహేశ్వర్‌రెడ్డి, రమేష్‌ నాయక్‌, రాము నాయక్‌, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

బంట్వారం: మండలంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం కోట్‌పల్లి మండలం ఇందోల్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పి.రాములను నియమించారు. కార్యక్రమంలో నాయకులు అనంత్‌రెడ్డి, శ్రీనివాస్‌, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement