నూతన కమిటీ నియామకం | - | Sakshi
Sakshi News home page

నూతన కమిటీ నియామకం

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

తాండూరు టౌన్‌: భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి (బీవీహెచ్‌పీఎస్‌) తాండూరు పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ పట్టణ అధ్యక్షుడిగా ఎన్‌ చందు, గౌరవాధ్యక్షుడిగా ఎండీ రియాజ్‌, కార్యదర్శులుగా ఎండీ ఖలీల్‌, గజలప్ప, కోశాధికారులుగా ఎం కృష్ణ, డీ శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శిగా ఎండీ మహ్మద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల సహాయ పరికరాలు వీల్‌ చైర్లు, ట్రైసైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాటరీ వీల్‌చైర్స్‌, సంక కర్రలు, చేతి కర్రలు, హియరింగ్‌ మిషన్స్‌ తదితర పరికరాల కోసం నవంబర్‌ 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కమిటీ జిల్లా, రాష్ట్ర బాధ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అలాగే సమితి బలోపేతం కృషి చేస్తామని నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మహ్మద్‌ ఖాన్‌, రవి, గణేశ్‌, షబ్బీర్‌, సంజీవ్‌, మజారుద్దీన్‌, హుసేనప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement