బొంరాస్పేట: దుద్యాల మండలం అల్లిఖాన్పల్లిలో బుధవారం కారు కాలిపోయింది. గ్రామానికి చెందిన శివకుమార్ రెండు రోజుల క్రితం తన స్నేహితుడి వద్ద నుంచి కారు తెచ్చుకున్నాడు. పలు గ్రామాలకు వెళ్లి సాయంత్రం ఒక చోట పార్క్ చేశాడు. షాట్ సర్క్యూట్తో వాహనం కాలిపోయిది. రూ.10 లక్షల మేర నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు.
ట్రాన్స్ఫార్మర్ వైర్లకు
మంటలు
దోమ: మండలంలోని పాలేపల్లి మార్గంలో వ్యవసాయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ వైర్లు బుధవారం కాలిపోయాయి. మంటలను చూసిన వాహనదారులు, రైతులు, ఆందోళనకు గురయ్యారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
● తీగాపూర్ శివారులో మృతదేహం
● వివరాలు సేకరించిన పోలీసులు
కొత్తూరు: గుర్తు తెలియని యువకుడు హత్యకు గురైన సంఘటన మండలంలోని తీగాపూర్ శివారు వెంచర్లో బుధవారం వెలుగుచూసింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఏసీపీ లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతుడి (25) గొంతు కోసి, కడుపు పలుమార్లు పొడిచినట్లు గుర్తించారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మృతుడు స్థానిక పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
● ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో ఘటన
● ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న బీరేంద్రకుమార్
ఇబ్రహీంపట్నం: ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ మహేందర్రెడ్డి, ఎస్ఐ భాస్కర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బీరేంద్రకుమార్ (24) భార్య గీతతో కలిసి ఇరవై రోజుల క్రితం శేరిగూడ వచ్చి ఓ గ్లాస్ కంపెనీలో పనిచేస్తూ గ్రామంలోనే నివసిస్తున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో గీత పనికి వెళ్లగా, గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకొని ఉరి వేసుకున్నాడు. సమయం దాటినా బీరేంద్రకుమార్ విధులకు వెళ్లకపోవడంతో తోటి కార్మికులు వచ్చి చూడగా విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా, ఏడాది క్రితం బీరేంద్రకుమార్ గీతను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు జార్ఖండ్లో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసు వ్యవస్థపై
నమ్మకం పెంచాలి
● డీసీపీ నారాయణరెడ్డి
● కడ్తాల్ పీఎస్లో తనిఖీలు
కడ్తాల్: పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీఎస్ను తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు, లాకప్, సీసీ కెమెరాలలు, పరిసరాలను పరిశీలించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. పెట్రోలింగ్, నిఘాను మరింత పటిష్టం చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యా దగా వ్యవహరించాలని సూచించారు. ఏసీపీ జానకీరెడ్డి, సీఐ సైదిరెడ్డి, ఎప్ఐలు రవీందర్, చంద్రశేఖర్ ఉన్నారు.


