పెండింగ్‌ కేసులు ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసులు ఉండొద్దు

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

● ఎస్పీ స్నేహ మెహ్ర

అనంతగిరి: పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, పెండింగ్‌ కేసుల పరిష్కారం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రోడ్డు భద్రత, మహిళలు మరియు పిల్లల భద్రత, సైబర్‌ నేరాల నివారణ తదితర అంశాలపై సూచనలు చేశారు, ప్రాపర్టీ, సైబర్‌, ఎన్‌డీపీఎస్‌ కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలు, పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ, మిస్సింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. మైనర్ల డ్రైవింగ్‌పై కఠిన చర్యలు చేపట్టడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రాత్రి పెట్రోలింగ్‌, వాహన తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాజేష్‌ మీన, డీఎస్పీలు జానయ్య, అంజయ్య, యాదయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement