పరిగి: మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లేశ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులను రెండో పీఆర్సీలోకి తీసుకొని, వేతనం రూ.26 వేలకు పెంచాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, వారికి పదోన్నతులు, బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో.. ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు కిష్టయ్య, నర్సింహులు, రఘు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


