ఇళ్ల స్థలాలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

అనంతగిరి: మున్సిపల్‌లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మైపాల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మున్సిపల్‌ కార్మికులు(సీఐటీయూ అనుబంధం) గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. వారంతపు సెలవులు ఇవ్వాలన్నారు. పనిభారం తగ్గించి, కనీస వేతనాలు రూ.26 వేలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.20 లక్షలు ఇవ్వాలని కోరారు. పెన్షన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు శంకర్‌, కార్యదర్శి బుచ్చయ్య, జంగమ్మ, లక్ష్మమ్మ, పెంటయ్య, గంగమ్మ, స్వప్న, అనసూయ, రాఘవేందర్‌, జ్యోతి, బుచ్చయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement