త్వరలో రెండో విడత ‘ఇందిరమ్మ’ | - | Sakshi
Sakshi News home page

త్వరలో రెండో విడత ‘ఇందిరమ్మ’

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

త్వరలో రెండో విడత ‘ఇందిరమ్మ’

పరిగి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల హామీలను అములు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నట్లు వివరించారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కుల్కచర్ల: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక కార్యాచరణలో సాగుతున్నామని అన్నారు. పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించడం ద్వారా 27లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. ఉద్దండపూర్‌ పథకంతో పరిగి నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని, భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఆంజనేయులు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కనకం మొగులయ్య, బ్లాక్‌ బీ అధ్యక్షుడు భరత్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌, నాయకులు డీటీ చంద్రశేఖర్‌, గిర్దవరి రవీందర్‌ చారి, ఆయా గ్రామాల సర్పంచులు నర్సింలు యాదవ్‌, తిరుపతయ్య, మడుగు శ్రీనివాస్‌, పీరంపల్లి వెంకటయ్య, చంద్రభూపాల్‌ రావు, రాజు, లాలు, గోవర్దన్‌ రెడ్డి, భరత్‌కుమార్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement