● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
● రైతులకు కంది విత్తనాల పంపిణీ
తాండూరు: పప్పు ధాన్యాల సాగుకు తాండూరు నేలలు అనుకూలమని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో రైతులకు ఉచితంగా కంది, పెసర, మినుము విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన విత్తనాలనే ఎంచుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్‌రెడ్డి, ఏడీఏ అరుణ, మున్సిపల్ కమిషన్ రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కును పరిరక్షించుకుందాం
తాండూరు టౌన్: ఎవరి ఓటు హక్కును వారు పరిరక్షించుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ అనిత ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాచౌక్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడూ విధిగా ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. నకిలీ ఓట్లకు అవకాశం ఇవ్వొదన్నారు. బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు బాధ్యతగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ రాకేష్ రెడ్డి, నాయకులు అబ్దుల్ రవూఫ్, గాజుల మాధవి, ప్రభాకర్ గౌడ్, నాగరాజు, సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


