పూడూరు: భూసార పరీక్షల ఆధారంగా ఖేతి బచావో అభియాన్‌ను సద్వినియోగం చేసుకుని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం పూడూరు మండల కేంద్రంలో వరి సాగులో కృత్రిమ మేధస్సు వినియోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అభియాన్ ప్రాముఖ్యతను గ్రహించి, బూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ శైలజ, డాక్టర్ క్రిష్ణవేణి, డాక్టర్ బజేంద్ర వ్యవసాయ ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పాండు, ఎంఆర్‌ఓ విజయ్‌కుమార్, సర్పంచ్ కిజర్‌పాషా, పీఎసీఎస్ మాజీ చైర్మన్ రఘునాథ్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, రాందాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


