ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు | - | Sakshi
Sakshi News home page

ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

తాండూరు రూరల్‌: ప్రాజెక్టు కాల్వల పునరుద్ధరణకు తాండూరు మండలం చంద్రవంచ వాగు నుంచి ఇసుక తరలిస్తుండగా.. బుధవారం ఆ గ్రామ మహిళలు కొందరు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అభివృద్ధి పనులకు అడ్డుకోవద్దని చెప్పినా ససేమిరా అనడంతో ఖాళీ టిప్పర్లతో వెనుదిరిగారు. ఇదే విషయమై తహసీల్దార్‌ తారాసింగ్‌ను వివరణ కోరగా.. కోట్‌పల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం గ్రామం నుంచి తరలించేందుకు కలెక్టర్‌ అనుమతి ఇచ్చారని తెలిపారు. కానీ గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. త్వరలో గ్రామస్తులతో మరోసారి చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటాం. ఇసుక పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇస్తాం. ప్రజలు సహకరించాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement