కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి
దౌల్తాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. ఇందుకు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తుందని తెలిపారు. మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి నూతన దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. గుడి నిర్మాణం కోసం ప్రజలు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. వారి కోరిక మేరకు సీఎం రూ.2 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, నాయకులు వీరన్న, వెంకట్‌రెడ్డి, ప్రమోద్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, దస్తప్ప, రెడ్డిశ్రీనివాస్, సత్యపాల్ తదితరులున్నారు.


