దుద్యాల్: మండల పరిధి ఎక్కచెరువుతండాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నిన్నమొన్నటి వర్షాలతో వీధుల్లో వరద నీరు నిలిచి తీవ్ర అసౌకర్యాన్ని తలపిస్తోంది. ఈ సందర్భంగా తండా వాసులు కొందరు మాట్లాడుతూ.. వాన నీరుముందుకు సాగక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. దుర్వాసతో ఇళ్లలో ఉండలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. దోమలు వృద్ధి చెంది, వ్యాధుల బారిన పడతామని వాపోతున్నారు. అధికారులు స్పందించి, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టి, సమస్యను పరిష్కరించాలని కోరారు.


