తాండూరు మూన్‌వాకర్‌కు అరుదైన గౌరవం
ఇండియా టీవీలో డాక్యుమెంటరీ ప్రసారం
తాండూరు టౌన్: తాండూరు మూన్‌వాకర్‌గా పేరొందిన వంశీకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ మీడియా ఇండియా టీవీలో అతని డాక్యుమెంటరీని శనివారం ప్రసారం చేసింది. వంశీకృష్ణ మైఖేల్ జాక్సన్ జయంతిని పురస్కరించుకుని 2015 ఆగస్టు 29న మూన్‌వాక్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. 2016లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 2017లో అంతర్జాతీయ వీఐపీ హోదా, 2019లో ఫాస్టెస్ట్ ర్యాప్ సింగింగ్, 2021లో రికార్డు సమయం పాటు గరుడాసన యోగా, ఫాస్టెస్ట్ డబుల్ నాంచాక్‌లో రికార్డులు సాధించి మన్ననలు పొందాడు. తాజాగా ఇండియా టీవీ యాజమాన్యం అత ను సాధించిన విజయాలను ప్రదర్శిస్తూ శనివారం ఆరు నిమిషాల పాటు డాక్యుమెంటరీని ప్రసారం చేశారు. తాండూరు వాసి రికార్డులతో పాటు ఇలాంటి సదవకాశాన్ని పొందిందినందుకు అభినందనలతో ముంచెత్తారు.


