
రేపటి బంద్‌కు సహకరించండి
వ్యాపారుల, ఆర్టీసీ, విద్యా సంస్థల మద్దతు కోరిన బీసీ జేఏసీ
తాండూరు టౌన్: 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా బీసీ జేఏసీ ఈ నెల 18న నిర్వహించనున్న బంద్‌కు అందరూ సహకరించాలని కందుకూరి రాజ్‌కుమార్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్ గురువారం పట్టణంలోని పలు విభాగాల అసోసియేషన్లను కోరారు. ఆర్టీసీ డిపో మేనేజర్, ప్రైవేట్ స్కూల్స్, కళాశాలల యాజమాన్య అసోసియేషన్, థియేటర్ల యాజమాన్యాలు, క్లాత్ అండ్ రెడిమేడ్ మర్చంట్స్, గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ తదితరులను కలిసి వినతి పత్రాలు సమర్పించి బంద్‌కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సోమశేఖర్, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, రామకృష్ణ, లక్ష్మణాచారి, శివ, పరమేశ్, విజయలక్ష్మి, నర్సమ్మ, మంజుల, వివేక్, కిరణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు
బంద్‌కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ పేర్కొన్నారు. గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరడం సమంజసమేనన్నారు. దీనికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ మద్దతు ప్రకటించారన్నారు. బీసీల న్యాయ పోరాటంలో తమ వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరుశురాం, స్వామిదాస్, కృష్ణ, శివాజీ, రవి, సూర్యప్రకాశ్, ఉమాశంకర్, చందు, శివ, నర్సిములు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరిలో..
అనంతగిరి: బంద్‌కు స్వచ్ఛందంగా కాలేజీలు, పాఠశాలలు, బస్సులు, దుకాణదారులు సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్ కృష్ణ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టి 9వ షెడ్యూల్‌లో పెట్టి తమిళనాడు మాదిరిగా రాజ్యాంగ భద్రత కల్పించాలని కృష్ణముదిరాజ్ కోరారు. తక్షణమే బీసీలకు రాజకీయ రాజ్యాంగ రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.