
నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
తాండూరు రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్ ఉమాశంకర ప్రసాద్ అన్నారు. తాండూరు మండలం చెంగోల్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓ గదిలో నిల్వ చేసిన బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతీ రోజు మెనూ పాటించాలన్నారు. గురువారం మెనూలో అన్నం, ఆకుకూరలు, పప్పు ఉండాలి కదా.. అని ఉపాధ్యాయులను అడిగారు. కానీ ఇక్కడ కేవలం సాంబారుతో భోజనం ఎలా వడ్డించారని ప్రశ్నించారు. హెచ్‌ఎం ఎక్కడున్నారని ప్రశ్నించగా సెలవులో ఉన్నారని సిబ్బంది చెప్పారు. దీంతో శుక్రవారం పాఠశాల రికార్డులు తీసుకుని తన కార్యాలయానికి రావాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యహ్నా భోజనం చేశారు.
మధ్యాహ్న భోజనం అమలులో
మెనూ పాటించాలి
తాండూరు సబ్ కలెక్టర్
ఉమా శంకరప్రసాద్
చెంగోల్ ఉన్నత పాఠశాలలో
ఆకస్మిక తనిఖీ