
యాసంగిపై ఆశలు!
రబీలో సాగు విస్తీర్ణం భారీగా పెరగనుంది. గడిచిన కాలంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, జలాశయాలు నిండుకుండను తలపిస్తుండగా.. భూగర్భ జలాలు పెరిగాయి. ౖపైపెకి ఉబికి వస్తున్నాయి. దీంతో యాసంగి ఈ సారి ఆశాజనకంగా ఉండనుంది.
తాండూరు: వానాకాలం(ఖరీఫ్)లో అతివృష్టికి పంటపొలాలు దెబ్బతిన్నాయి. చేతికందొచ్చిన పంట నేలపాలై నష్టాలను మూటగట్టుకున్న రైతన్నలు.. ఆ లోటును ప్రస్తుత యాసంగి(రబీ)లో పూడ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆశతో సాగుకు సమాయత్తం అవుతున్నారు. వ్యవసాయ శాఖ ప్రణాళికను మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధాన పంటగా వరి
రబీ పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.56 లక్షల ఎకరాల్లో సాగు అంచనా వేశారు. అయితే అందులో వరి 1.01 లక్షల ఎకరాలు, కూరగాయ పంటలు మరో 7,121 వేల ఎకరాల్లో ఉండనుంది. 70 శాతం ప్రధాన పంటగా వరి సాగు కానుంది. పప్పు, నూనే గింజలు శనగలు 4,216 ఎకరాలు, వేరు శనగ 15,110 ఎకరాలు, మొక్కజొన్న, జొన్న, కుసుమ తదితర పంటలను మిగిలిన ఎకరాల్లో సాగుకు సిద్ధం చేశారు.
ఉద్యాన పంటలకు ఊతం
ప్రస్తుత యాసంగిలో 7,121 ఎకరాల్లో కూరగాయలు సాగవనున్నట్లు వ్యవసాయ శాఖఅంచనా వేసింది. ఉల్లి, టమాటా, మిరప, బీర, బెండ, క్యాబేజీ తదితర వాటిని పండిస్తున్నారు. ఉద్యాన రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, చెరకు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలను 1.48 లక్షల ఎకరాలు, కూరగాయలు 7,121 ఎకరాల్లో సాగవనుంది. ఇతర పంటలతో కలిపి మొత్తంగా జిల్లాలో 1,56,925 ఎకరాల్లో యాసంగి సాగుకు ప్రఽణాళికను సిద్ధం చేశారు.
పంటల వారీగా రబీ సాగు..
పంట ఎకరాలు
వరి 1,01,397
శనగ 4,217
వేరుశనగ 15,110
జొన్న 12,745
మొక్కజొన్న 11,271
చెరకు 700
పొద్దుతిరుగుడు 2,513
కంది 1,376
ఇతర పంటలు 475
కూరగాయ పంటలు 7,121
మొత్తం 1,56,925
నిండుకుండల్లా జలాశయాలు
పెరిగిన భూగర్భ జలాలు
సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్న
జిల్లాలో 1,56,925ఎకరాల్లో పంటల అంచనా
ఉద్యాన పంటలు 7,121 వేలు,వరి 1.01 లక్షల ఎకరాలు