
అప్రమత్తంగా ఉండాలి
దోమ: అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఫైర్ ఆఫీసర్ సేవ్యనాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ రూపాలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవిలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్యాస్ సిలిండర్ లీక్ అయిన సమయంలో ఇంటిలోని కిటికీలను తెరిచి ఉంచాలన్నారు. ప్రమాదం జరిగితే వెంటనే డయల్ 101, 102 నంబర్లకు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది చంద్రమోహన్, పాండురంగం, వెంకటేశం, మొగులయ్య, వెంకటయ్య, కళాశాల అధ్యాపకులు రాధ శ్రీవిద్య, రాములు, లక్ష్మణ్, మధుసూదన్, శ్రీధర్, సువర్ణ, సానియా సుల్తానా, శ్రీకాంత్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.