
నవజాత శిశు సంరక్షణపై
ప్రత్యేక దృష్టి పెట్టాలి
తాండూరు: నవజాత శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కొడంగల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజు వైద్య సిబ్బందికి సూచించారు. తాండూరు ఎంసీహెచ్‌లో శుక్రవారం స్టాఫ్ నర్సులు, నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవజాత శిశువులకు ఆరోగ్య సమస్యలు వస్తే ఒత్తిడికి లోనై హైదరాబాద్‌కు రెఫర్ చేయరాదన్నారు. అక్కడే వైద్యం చేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో మెడికల్ కళాశాల నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పెడియాట్రిక్ వైద్యులు డాక్టర్. మూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, వైద్యులు శ్రీలత, జైపాల్‌రెడ్డి, స్టాఫ్ నర్సులు అనిత, సౌందర్య, రాణి, ఆసిఫా, నిర్మల సింగ్ తదితరులు పాల్గొన్నారు.