
సామాజిక తెలంగాణే జాగృతి లక్ష్యం
తుక్కుగూడ: సామాజిక తెలంగాణ సాధనే జాగృతి లక్ష్యమని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి జనయాత్ర చేపట్టనుందని తెలిపారు. యాత్ర మొదటగా ఈ నెల 25న నిజమాబాద్ నుంచి ప్రారంభమై, 33 జిల్లాలో కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కోల శ్రీనివాస్, నరేష్, బండారి లావణ్య, ముస్తాపా, రామకోటి, రాము యాదవ్, నవీన్‌గౌడ్, సందిప్, సత్యానారాయణ, బాబురావు, సాల్వాచారి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
‘జనంబాట’ను జయప్రదం చేద్దాం
కందుకూరు: సామాజిక తెలంగాణే కవిత లక్ష్యమని, అందుకోసం ఈ నెల 25 నుంచి చేపట్టనున్న ‘జనంబాట’ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని జాగృతి జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని కార్యాలయంలో సంస్థ జిల్లా యాత్ర పర్యవేక్షకుడు శ్రీనివాస్, నరేష్, అర్చన సేతుపతి సమక్షంలో నిర్వహించిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాత్రలో భాగంగా ఆదివాసి, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు బీసీ రిజర్వేషన్ల అమలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకై పోరాటం చేయనుందన్నారు. జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు లావణ్య పాల్గొన్నారు.
సంస్థ జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి