
ఆర్డీఓకు ఘన సన్మానం
అనంతగిరి: వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్రకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా బృందం శుక్రవారం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో తహసీల్దార్లు లక్ష్మీనారాయణ, మునీరుద్దీన్, విజయ్‌కుమార్, డీటీలు శ్రీలత, అనిత, శ్రీనివాస్‌గౌడ్, నవీన్, వీరేష్‌బాబు, ఆర్‌ఐలు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైస్ సరఫరాను వేగవంతం చేయండి
అనంతగిరి: సీఎంఆర్(కస్టమ్ మిల్డ్ రైస్) డెలివరీని వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌లింగ్యా నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధి వేంకటరమణ రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు. రబీ 202425కు సంబంధించి రైస్ సరఫరాలో అలసత్వం చేయకుండా.. ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లు యజమానికి సూచించారు. ఆయన వెంట పౌరసరఫరాల జిల్లా అధికారి మోహన్ కృష్ణ ఉన్నారు.
‘మత్తు’ దందాను అరికట్టాలి
కొడంగల్ రూరల్: నానాటికీ పెరుగుతున్న మత్తు మందు దందాను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) శేరిలింగంపల్లి జోన్ అసిస్టెంట్ డైరెక్టర్ కె.అనిల్‌కుమార్, జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఏఎన్.క్రాంతికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. ఎక్కడైనా మత్తు మందు తయారు చేస్తున్నా, వైద్యుడి చీటి లేకుండా అబార్షన్ కిట్స్, నిద్రమాత్రలు తదితర వాటిని విక్రయిస్తున్నా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా డీసీఏకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 18005996969కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
నేరాలను నియంత్రించండి
పహాడీషరీఫ్: పెట్రోలింగ్ ముమ్మరం చేసి, నేరాలను నియంత్రించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు.. ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ రెడ్డికి సూచించారు. శుక్రవారం ఆయన పహాడీషరీఫ్ ఠాణను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల పరిశీలనతో పాటు సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. కేసులు, దర్యాప్తు తదితర అంశాలపై ఆరా తీశారు. న్యాయం కోసం వచ్చే వారికి భరోసా కల్పించాలని చెప్పారు.
హయత్‌నగర్: మానవుడు తన అవసరాలకు సహజ వనరులను విధ్వంసం చేస్తున్నాడని, ప్రకృతి సహజత్వాన్ని కాపాడి భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ పర్యావరణవేత్త పాలడుగు జ్ఞానేశ్వర్ అన్నారు. హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడవులను కొల్లగొటి, సహజ నీటి వనరులను కలుషితం చేయడంతో మంచినీటిని కొనుక్కునే పరిస్థితి వచ్చిందని అన్నారు. భవిష్యత్తులో గాలిని కూడా కొనాల్సిన దుస్థితి రావచ్చన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వృక్ష సంబంధమైన వస్తువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌బాబు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, నక్క శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీఓకు ఘన సన్మానం

ఆర్డీఓకు ఘన సన్మానం

ఆర్డీఓకు ఘన సన్మానం