
భారతి సిమెంట్‌తో నిర్మాణాలు వేగవంతం
కొత్తూరు: భారతి సిమెంట్‌తో నిర్మాణాలు మరింత వేగవంతంగా పూర్తి చేయవచ్చని సంస్థ టెక్నికల్ అధికారి శ్రీకాంత్ అన్నారు. కొత్తూరు పట్టణంలో గురువారం తాపీ మేసీ్త్రలకు నిర్మాణ రంగం, సిమెంట్ వినియోగంపై భారతి సిమెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భారతి సిమెంట్ ఆల్ట్రాఫాస్ట్ బ్రాండ్‌తో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్‌ను తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసిందన్నారు. ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి ఆల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వివరించారు. అంతేకాకుండా సిమెంట్ నాణ్యత మరింత దృఢంగా ఉంటుందని తెలిపారు. భారతి ఆల్ట్రాఫాస్ట్ సిమెంట్ సీసీ రోడ్లు, స్లాబులు, వంతెనల నిర్మాణాలకు అత్యంత అనువుగా ఉంటుందని స్పష్టంచేశారు. భారీ నిర్మాణాలు చేసే సంస్థల నిర్వాహకులకు సిమెంట్ వినియోగంలో ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని తెలిపారు. భారతి సిమెంట్ వినియోగించే వారి కట్టడాల వద్దకే ఇంజనీర్లు వచ్చి సూచనలు ఇస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టెక్నికల్ ఆఫీసర్ నితిన్, డీలర్ జయవర్ధన్‌రెడ్డి, తాపీ మేసీ్త్రలు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్లోకి ఆల్ట్రాఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్
సంస్థ టెక్నికల్ ఆఫీసర్ శ్రీకాంత్
కొత్తూరులోతాపీ మేసీ్త్రలకు అవగాహన సదస్సు