
ఇసుక రీచ్‌ల పరిశీలన
యాలాల: మండల పరిధిలో ఇసుక రీచ్‌లను అధికారుల బృందం గురువారం పరిశీలించారు. జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మిషన్ భగీరథ ఈఈ రవికుమార్, తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ పుష్పలీల, ఆర్‌డబ్ల్యుఎస్, ఇరిగేషన్ ఏఈలు ప్రభాకర్, భానుప్రకాశ్, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ నిర్మల తదితరులు కాగ్నా, కాకరవేణి నది ప్రాంతాలను సందర్శించారు. కోకట్, బెన్నూరు, సంగెంకుర్దు, గోవిందరావుపేట, విశ్వనాథ్‌పూర్, దేవనూరు తదితర ప్రాంతాల్లో వాటిని గుర్తించారు. ప్రభుత్వ పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించేందుకు గుర్తిస్తున్నట్లు అధికారుల బృందం తెలిపింది. పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ యాదయ్య, ఆర్‌ఐలు చరణ్, వేణు, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, తారకచారి, నరహరి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.