
పర్యాటకుల భద్రతే లక్ష్యం
అనంతగిరి: పర్యాటకుల భద్రతే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్‌తో కలిసి ఇటీవల టూరిస్ట్ పోలీస్ అధికారులుగా శిక్షణ పొందిన వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాకు చెందిన 10మంది పోలీసులు శిక్షణ పొందినట్లు తెలిపారు. వీరు ప్రముఖ పర్యాటక కేంద్రాలైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం, అనంతగిరి అటవీ ప్రాంతం, కోట్‌పల్లి రిజర్వాయర్, బుగ్గ వంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ఎస్పీ నారాయణరెడ్డి