
క్యాష్‌లెస్ లావాదేవీలు ఉత్తమం
డీఆర్‌డీఓ శ్రీనివాస్
బంట్వారం: నగదు రహిత లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయని, దీనిపై మహిళా సంఘాల సభ్యులు అవగాహన పెంచుకోవాలని డీఆర్‌డీఓ శ్రీనివాస్ అన్నారు. గురువారం కోట్‌పల్లి మండలం కొత్తపల్లిలో క్యాష్‌లెస్ లావాదేవాలపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక లావాదేవీలు క్యాష్‌లెస్ ద్వారానే చేపట్టాలన్నారు. అనంతరం కోట్‌పల్లిలోని పీఎంఎఫ్‌ఎంఈ యూనిట్‌ను సందర్శించారు. బార్వాద్‌లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ నర్సింలు, డీపీఎం శేఖర్, ఐకేపీ ఏపీఎం సురేష్, ఈజీఎస్ ఏపీఓ ఎలీష్ తదితరులు పాల్గొన్నారు.