
కార్యకర్తల అభీష్టం మేరకే..
డీసీసీ అధ్యక్షుడి నియామకం
● ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా చూడాలి
● ఏఐసీసీ ఇన్‌చార్జ్ సూరజ్‌సింగ్ ఠాగూర్
తాండూరు: డీసీసీ అధ్యక్షుడి నియామకం కార్యకర్తల అభీష్టం మేరకే జరుగుతుందని ఏఐసీసీ ఇన్‌చార్జ్ సూరజ్ సింగ్‌ఠాగూర్ అన్నారు. గురువారం జిల్లా అధ్యక్షుడి నియామకం కోసం యాలాల, బషీరాబాద్ మండలాల నాయకులతో పట్టణంలోని వెంకోబా గార్డెన్‌లో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రతి నాయకుడు, కార్యకర్తా పని చేయాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయడమే లక్ష్యంగా సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు రమేష్ మహరాజ్, ఆర్యవైఽశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, మురళీకృష్ణగౌడ్, రవిగౌడ్ పాల్గొన్నారు.