
బీసీ బంద్‌ను జయప్రదం చేయాలి
అనంతగిరి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో శనివారం తలపెట్టిన వికారాబాద్ బంద్‌ను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బంద్‌కు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు బీఆర్ శేఖర్, గంగారం వెంకట్, అడ్వకేట్ లక్ష్మణ్, నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, దాసు, పాండు ముదిరాజ్, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వీడీడీఎఫ్ మద్దతు
బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వీడీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ చిత్తశుద్ధితో మద్దతు ఇవ్వాలని కోరారు.
సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి