ఘనంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు

Oct 13 2025 9:47 AM | Updated on Oct 13 2025 9:47 AM

ఘనంగా

ఘనంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు

ఘనంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు రిజర్వేషన్లపై అగ్రకులాల కుట్ర నడక ఆరోగ్యానికి మేలు భూ బాధితులకు ఇంటి జాగలు

పరిగి: లక్ష్మీనర్సింహ స్వామి చతుర్థ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. తొలిరోజు ఆదివారం స్వామి వారికి వేదస్వస్తి, యాగశాల ప్రవేశం, విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, దీక్షాధారణ, రుత్విక్కరణం, మృత్సంగ్రహణ, అంకురార్పణ, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ట హోమం, ధ్వజారోహణం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగాలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.

బీసీ సంఘం నాయకుల ఆరోపణ

18న తాండూరు బంద్‌కు పిలుపు

తాండూరు టౌన్‌: బీసీ రిజర్వేషన్లపై ఉన్నత న్యాయస్థానం స్టే ఇవ్వడం అగ్రకులాల కుట్రలో భాగమేనని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్‌ ఆరోపించారు. బహుజనులు బానిసలుగానే ఉండాలనే వారి దురహంకారాన్ని ఎండగడతామన్నారు. స్టేకు నిరనగా ఈ నెల 18న తాండూరు బంద్‌కు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ..సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేసే పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బంద్‌కు వ్యాపారులు, విద్యా సంస్థలు, పార్టీలకు అతీతంగా సహకరించాలని ఆయన కోరారు.

తాండూరు టౌన్‌: మార్నింగ్‌ వాక్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందని మార్వాడీ యువమంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు మన్మోహన్‌ సార్డా అన్నారు. ఆదివారం యువమంచ్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌ ప్రకాష్‌ సార్డా జెండా ఊపి వాక్‌థాన్‌ను ప్రారంభించారు. అనంతరం మన్మోహన్‌ మాట్లాడారు. నేటి ఉరుకుపరుగుల జీవితంలో ప్రజల ఆహారపు అలవాట్లు మారాయని, వ్యాయామానికి దూరమయ్యారని తెలిపారు. తద్వారా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. నిత్యం గంటపాటు నడిస్తే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. మంచ్‌ తాండూరు అధ్యక్షుడు అనిల్‌ సార్డా, కార్యదర్శి సచిన్‌ రాఠి, కోశాధికారి అరుణ్‌ సార్డా, రోహిత్‌ అగర్వాల్‌, సూర్య ప్రకాష్‌ సోమాని తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఎల్మినేడు భూ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం ఇంటి జాగలు ఇచ్చి ఆదుకుంటానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం భూ బాధితులు ఎమ్మెల్యేను కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ముఖ్యమంత్రిని ఒప్పించి, కలెక్టర్‌కు ఆదేశాలు ఇప్పించామన్నారు. త్వరలో అధికారులు మరలా ఎల్మినేడుకు వస్తారన్నారు. మొదట ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేపట్టి, రికార్డు ప్రకారం అర్హులైన రైతులకే ప్లాట్లు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అక్రమాలు, అవినీతి జరిగితే లీగల్‌టీం క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని వివరించారు.

ఘనంగా నృసింహుడి  బ్రహ్మోత్సవాలు  
1
1/3

ఘనంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు

ఘనంగా నృసింహుడి  బ్రహ్మోత్సవాలు  
2
2/3

ఘనంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు

ఘనంగా నృసింహుడి  బ్రహ్మోత్సవాలు  
3
3/3

ఘనంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement