
తాండూరును హస్తగతం చేసుకుంటాం
తాండూరు రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యవస్థ ప్రారంభం నాటి నుంచి తాండూరులో కాంగ్రెస్ జెండా ఎగురలేదని.. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలాన్ని హస్తగతం చేసుకుంటామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో చెన్‌గేస్‌పూర్, కోనాపూర్ గ్రామల నుంచి 200 మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరులో జెడ్పీటీసీగా గెలిచే వారికే అవకాశం కల్పిస్తున్నామన్నారు. 15 ఎంపీటీసీ స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను నిలుపుతామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్శితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. చెన్‌గేస్‌పూర్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ప్రవీణ్‌కుమార్ గౌడ్ తదితరులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ నాయకులు వేణు, శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్‌రాజుగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, భీంసేన్, గుండప్ప ముదిరాజ్, రాములు, నరేష్ ముదిరాజ్, రాములమ్మ, రాములు తదితరులు ఉన్నారు.
వెల్‌డన్ ఆదిత్య
తాండూరు టౌన్: ప్రభుత్వ గురుకులాల్లో ప్రైవేటుకు దీటుగా బోధన అందుతోందనడానికి ఆదిత్యవర్ధన్ మంచి ఉదాహరణ అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివి టాప్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించడం గొప్ప విషయమని కొనియాడా రు. యాలాల మండలం బండమీదిపల్లికి చెందిన నర్సింలు, పద్మ దంపతుల కుమారుడు ఆదిత్యవర్ధన్ నీట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి, హైదరాబాద్‌లోని కామినేని మెడికల్ కళాశాలలో ఫ్రీ సీటు దక్కించుకోవడం అభినందనీయమన్నారు. మంగళవారం తనను కలిసిన విద్యార్థిని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేతో పాటు ఉన్న సీనియర్ నా యకులు డాక్టర్ సంపత్, ధారాసింగ్, పి.నర్సింలు, చందర్ ఉదయ్ భాస్కర్, మురళీకృష్ణ గౌడ్, మాధవరెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు అభినందించారు.
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి