
ఎస్‌బీఐ సేవలు వినియోగించుకోవాలి
నవాబుపేట: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను రైతులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని ఆర్కతలలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత రైతులకు, ప్రజలకు ఉపయోగపడేలా ఎస్‌బీఐ సేవలు అందిస్తుందన్నారు. రూ.436 వార్షిక ప్రీమియం చెల్లించి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజనతో రూ.2లక్షల జీవిత బీమా రక్షణ పొందవచ్చన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో రూ.20 ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల బీమా సదుపాయం అందుతుందని చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ద్వారా అతి తక్కువ పెట్టుబడితో వృద్ధాప్యంలో అత్యధిక ప్రయోజనాలు అందుతాయన్నారు. పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, ఈకేవైసీ సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్‌బీఐ ఏజీఎం తాన్యశర్మ, డీజీఎంలు కుమార్ రోహిత్, సతీశ్ కుమార్, వికారాబాద్ రీజియన్ ఏజీఎం నితిన్ కుమార్, రమ్య, ఎల్‌డీఎం యాదగిరి, ఎంపీడీఓ అనురాధ, ఏజీఎం ఎస్‌ఎల్‌బీసీ శ్రీహరి, నవాబుపేట బ్రాంచ్ మేనేజర్ అరుణ్ కుమార్, సిబ్బంది, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్