అన్ని విధాలా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అన్ని విధాలా అభివృద్ధి

Sep 4 2025 8:43 AM | Updated on Sep 4 2025 8:43 AM

అన్ని

అన్ని విధాలా అభివృద్ధి

అన్ని విధాలా అభివృద్ధి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ప్రత్యేక పూజలు 58కిలోల లడ్డూ సమర్పణ నేటి అర్ధరాత్రి వరకే ‘మహా’ దర్శనం

ఎస్టీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి కమలాకర్‌రెడ్డి

అనంతగిరి: పీఎం జన్‌మన్‌లో భాగంగా ఆది కర్మయోగి కార్యక్రమం కింద జిల్లాలో ఎంపికై న 13 మండలాల నుంచి 31 గిరిజన హాబిటేషన్లలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్టీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి కమలాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్‌లోని తేజ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 7 శాఖల సమన్వయంతో 91మంది ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపిక చేసిన గ్రామాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్‌, డీఎంహెచ్‌ఓ లలితాకుమారి పాల్గొన్నారు.

జిల్లా వైద్యాధికారి లలితాదేవి

పూడూరు: ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి లలితాదేవి సూచించారు. బుధవారం మండల పరిధిలోని చన్గోముల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి డాక్టర్‌, సిబ్బందితో మాట్లాడారు. మందుల రికార్డులు పరిశీలించారు. రేబీస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందా అని ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పర్యటించే ఏఎన్‌ఎంలు విషజ్వరాలు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యాధికారి మహమ్మద్‌ ఇక్బాల్‌ ఫారుకీ, సిబ్బంది షాహిదాబీ, రవికుమార్‌, సాజద్‌అలీ, దాసు తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌లో ప్రతిష్ఠించిన పలు వినాయకుడి విగ్రహాలను గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజలు చేసి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, మండప నిర్వాహకులు ఉన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని శివరాంనగర్‌ కాలనీలో పార్దివాలా సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి ఓ భక్తుడు వినూత్న రూపంలో తన మొక్కును చెల్లించుకున్నాడు. కాలనీకి చెందిన రాంబాబు తన ఏకై క కుమారుడు కార్తీక్‌ బరువు ఎంత ఉంటే అన్ని కిలోల లడ్డూను సమర్పిస్తానని మొక్కుకున్నాడు. ఆయన కుమారుని బరువు 58 కిలోలు ఉండటంతో 58 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు.

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ మహా వినాయకుడి దర్శనానికి గురువారం అర్ధరాత్రి వరకే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత భక్తుల దర్శనాలను నిలిపివేస్తామని నిర్వాహకులు తెలిపారు. శనివారం మహా వినాయకుడి నిమజ్జనం సందర్భంగా షెడ్డు తొలగింపు పనులు, క్రేన్‌ ఏర్పాట్ల కారణంగా శీఘ్ర, సర్వదర్శనాలకు అవకాశం ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించి నిర్వాహకులకు, పోలీసులకు సహకరించాలని కోరారు.

అన్ని విధాలా అభివృద్ధి 1
1/1

అన్ని విధాలా అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement