
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే
● పల్లెల్లో బీజేపీ బలపడుతోంది
● ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప
తాండూరు రూరల్: పల్లెల్లో రోజురోజుకూ బీజేపీ బలపడుతోందని ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప అన్నారు. బుధవారం తాండూరు మండలం గౌతాపూర్‌లో మండల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన బీజేపీ తరఫున అభ్యర్థులను నిలపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని పేర్కొన్నారు. పేదలు, రైతుల సంక్షేమం ప్రధాని మోదీ అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు చెంగోల్, సిగిరిపేట్ గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు శేఖాపురం ఆంజనేయులు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, నాయకులు విజయ్‌కుమార్, చిరంజీవి, మల్లికార్జున్, మల్లేశం, సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.