ఆసరా.. అంతేనా! | - | Sakshi
Sakshi News home page

ఆసరా.. అంతేనా!

Sep 4 2025 8:43 AM | Updated on Sep 4 2025 8:43 AM

ఆసరా.

ఆసరా.. అంతేనా!

దరఖాస్తు చేసినా రాలే..

ఆదేశాలు రాలేదు

జాడలేని కొత్త పింఛన్లు

అర్హుల ఎదురుచూపులు

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

కేశంపేట: ఆసరా పింఛన్లు కొత్తగా మంజూరు కాకపోవడంతో అర్హులైనవారు అశగా ఎదురుచూస్తున్నారు. నాయకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం నుంచి ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వరకు అర్హులకు నూతనంగా పెన్షన్‌ మంజూరు చేయలేదు. దీంతో గ్రామాల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు ఆసరా కోసం నిరీక్షిస్తున్నారు.

కార్యాలయాల చుట్టూ చక్కర్లు

వృద్ధాప్యంలో ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్‌ వస్తే భరోసాతో బతకవచ్చని వృద్ధులు భావిస్తున్నారు. అలాగే ఇంటి పెద్దలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వితంతు మహిళలు ఈ సహాయంతో కుటుంబాన్ని పోషించుకోవచ్చని, ఒంటరి మహిళలు ఎవరిపై ఆధారపడకుండా జీవించొచ్చని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మూడేళ్లుగా ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయడం లేదు. దీంతో అర్హులైన వారు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌, కలెక్టరేట్‌ కార్యాలయానికి వస్తున్నారు.

స్పష్టత కరువు

కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గతంలో 57 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి వృద్ధాప్య పెన్షన్‌ మంజూరు కోసం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, విచారణ అనంతరం మంజూరు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య పెన్షన్‌ వయస్సు పెంచినట్టు గ్రామాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ చేయూత సైట్‌లో 65 ఏళ్ల వారికి వృద్ధాప్య పింఛన్‌లకు అర్హులుగా కన్పిస్తోంది. దీంతో గ్రామాల్లో 57 ఎళ్లు నిండిన వృద్ధులు అయోమయంలో పడ్డారు. వయస్సు నిర్ధారణపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

కొందరికే అవకాశం

ప్రస్తుతం పింఛన్ల మంజూరుకు కొందరికి మాత్రమే ఉన్నతాధికారులు అవకాశం కల్పించారు. వృద్ధాప్య పెన్షన్‌ పొందుతున్న వారు మరణిస్తే ఆ స్థానంలో భార్య లేదా భర్తకు అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్‌ పొందుతూ దివ్యాంగులైన వారికి వృద్ధాప్య పెన్షన్‌ నుంచి వికలాంగుల పింఛన్‌కు మారుస్తున్నారు. దివ్యాంగుల పింఛన్‌ పొందుతూ మరణించిన వారి పింఛన్‌ను వృద్ధాప్య పింఛన్‌కు అధికారులు మార్చడం లేదు.

నా భర్త వికలాంగుల పింఛన్‌ తీసుకుంటూ రెండేళ్ల కిత్రం మృతి చెందాడు. అప్పటి నుంచి భర్త పింఛన్‌ మార్చి వితంతు పింఛన్‌ మంజూరు చేయలని అధికారులు చుట్టూ తిరుగుతున్నాను. ప్రజావాణిలో కలెక్టర్‌కు దరఖాస్తు చేసినా నేటికీ పింఛన్‌ మంజూరు చేయడం లేదు.

– చిర్ర వెంకటమ్మ,

కేశంపేట గ్రామం

పింఛన్ల కోసం ఎవరైనా దరఖాస్తు ఇస్తే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు తీసుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తాం. కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు.

– రవిచంద్రకుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి, ఎంపీడీఓ, కేశంపేట

ఆసరా.. అంతేనా!1
1/2

ఆసరా.. అంతేనా!

ఆసరా.. అంతేనా!2
2/2

ఆసరా.. అంతేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement