ఏకదంతుడి పూజలో ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ఏకదంతుడి పూజలో ఎస్పీ

Sep 3 2025 8:00 AM | Updated on Sep 3 2025 8:00 AM

ఏకదంత

ఏకదంతుడి పూజలో ఎస్పీ

ఏకదంతుడి పూజలో ఎస్పీ టీఎస్‌ఎస్‌ కళాకారులకు సన్మానం

అనంతగిరి: వికారాబాద్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని మంగళవారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఉదయం ఎస్పీ నారాయణరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అనంతగిరి: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా కళారూపాలు ఉండాలని అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌ సూచించారు. జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారథి(టీఎస్‌ఎస్‌)లో పనిచేస్తున్న గారెపాక భిక్షపతి, చింతల స్వప్న రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో ఇరువురికి జిల్లా పౌర సంబంధాల అధికారి ఆకుల చెన్నమ్మ, అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌, సిబ్బంది ఘనంగా సన్మానించారు.

ఏకదంతుడి పూజలో ఎస్పీ
1
1/1

ఏకదంతుడి పూజలో ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement