
కాంగ్రెస్‌వి నిరాధార ఆరోపణలు
అనంతగిరి: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు నిరసనగా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, పార్టీ ముఖ్య నాయకులు నల్ల దుస్తులు ధరించి తబలా వాయిస్తూ పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి ఎన్‌టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కేసీఆర్‌పై కుట్రలు పన్నడం మాని రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేసిన కేసీఆర్‌పై సీబీఐ కేసులు పెట్టడం సరికాదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్‌రెడ్డి, అశోక్, మైనార్టీ అధ్యక్షుడు గయాజ్, సీనియర్ నాయకులు మాధవరెడ్డి, పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, షఫీ, దత్తు, పాండు, గిరీశ్ కొఠారి, గోపి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కుట్రలను బహిర్గతం చేస్తాం
పరిగి: బీఆర్‌ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శమని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, కేసీఆర్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం తిప్పికొట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం నిరసన కార్యక్రమం చేపడుతుంటే పోలీసులు మాజీ ఎమ్మెల్యేను, బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. కొందరు పార్టీ నాయకులు పట్టణ కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై చేస్తున్న కుట్రను ప్రజాక్షేత్రంలో బహిర్గతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ముకుంద అశోక్‌కుమార్, మీర్‌మహ్మద్, ప్రవీణ్‌రెడ్డి, భాస్కర్, ఆంజనేయులు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్

కాంగ్రెస్‌వి నిరాధార ఆరోపణలు