
సెలవుపై కలెక్టర్
రంగారెడ్డి కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు
అనంతగిరి: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ 15 రోజుల పాటు సెలవుపై వెళ్లారు. కాగా ఈ పదిహేను రోజుల పాటు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి అప్పగించారు.
6వ తేదీ వరకు పేర్ల నమోదుకు అవకాశం
అనంతగిరి: హైదరాబాద్‌లో ఈ నెల 9, 10వ తేదీల్లో రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ సెలక్షన్ 2025–26 పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడలాధికారి ఎంఏ సత్తార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6వ తేదీ వరకు ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు జిల్లా క్రీడలాధికారి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, షటిల్–బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, లాన్‌టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖో ఖో పోటీలు ఉన్నాయని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ఉద్యోగులు సర్వీస్ సర్టిఫికెట్ లేదా ఐడెంటిటీ కార్డును జతపరచాలన్నారు.
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్ గ్రామానికి బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి రానున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేఖర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. హకీంపేట్‌లో నూతనంగా నిర్మిస్తున్న (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) అధునాతన సాంకేతిక కేంద్రం నిర్మాణానికి, కోస్గి–తుంకిమెట్ల పీడబ్ల్యూ రోడ్డు నుంచి దుద్యాల్ డబుల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, గౌరారంలో మోడల్ అంగన్వాడీ భవనాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై మంత్రి పర్యటను విజయవంతం చేయాలని కోరారు.
ఇబ్రహీంపట్నం: దూర విద్యతో ఉజ్వల భవిష్య త్తు ఉంటుందని డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫె సర్ ధర్మనాయక్ అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని దూరవిద్య స్టడీ సెంటర్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కౌన్సిలర్ల సమావేశంలో మాట్లాడారు. రెగ్యులర్ వర్సిటీ లతో సమానంగా సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ తదితర కోర్సులు అందిస్తున్నట్లు వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో బీబీఏ కోర్సును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. మిగతా వర్సిటీలతో పొల్చుకుంటే అంబేడ్కర్ యూనివర్సిటీలో ఫీజులు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. రెగ్యులర్ డిగ్రీలు చేయలేనివారు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దూరవిద్య డిగ్రీకి రెగ్యులర్ డిగ్రీతో సమానమైన విలువ ఉంటుందన్నారు.

సెలవుపై కలెక్టర్