దుద్యాల్: కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మండలంనుంచి పలువురు బీసీ నాయకులు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి సోమవారం ఢిల్లీకి పయనమయ్యారు. మండల కేంద్రానికి చెందిన మెరుగు వెంకటయ్య కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, బీసీ సంఘం జిల్లా ముఖ్య నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మీనాక్షి నటరాజన్‌తో కలిసి ట్రైన్‌లో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన వెంట కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీసీ నాయకులు ఉన్నారు.
అనంతగిరి: బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధనకై కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి వికారాబాద్ ప్రాంతం నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సోమవారం బయలుదేరారు. హైద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో వీరంతా పయనమయ్యారు. రిజర్వేషన్‌ల సాధనకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రత్యేక రైలులో ప్రయాణం
యాలాల: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు సాధనలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సోమవారం మండల నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, ముదిరాజ్ సంఘ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ హన్మంతు, నాయకులు మహిపాల్ తదితరులు ఢిల్లీకి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో బయలుదేరారు.
ఢిల్లీకి తరలిన బీసీ నాయకులు
ఢిల్లీకి తరలిన బీసీ నాయకులు