
రైతుల పొలాల్లో ఆస్తుల సర్వే
దుద్యాల్: మండల పరిధిలోని పారిశ్రామికవాడ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. భూములు ఇచ్చిన రైతుల పొలాల్లో ఉన్న ఆస్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మండల పరిధిలోని హకీంపేట్ గ్రామ పరిధిలోని ఇటీవల భూములు ఇచ్చిన రైతులు పొలాల్లో పెద్ద పెద్ద వృక్షాలు, బోర్లు, పశువుల షెడ్లకు సంబంధించి వివరాలను మంగళవారం సేకరించారు. గతంలో కొంత మందికి పొలాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి పరిహారం ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా రైతుల పొలాల్లో ఆస్తుల వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదించామని తహసీల్దార్ కిషన్ తెలిపారు. సర్వేలో హర్టికల్చర్ అధికారి సురేంద్రనాథ్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.