
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
హస్తినాపురం: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై గిరీష్‌కుమార్ వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామానికి చెందిన మంచన్‌పల్లి లోకేశ్(31) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉంటున్నాడు. గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మనస్తాంపం చెంది గత నెల 26న పురుగుల మందు తాగడంతో వెంటనే కుటుంబ సభ్యులు బండ్లగూడ జాగీర్‌లోని మెడిలైఫ్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.