
బాధ్యతలు స్వీకరించిన ఏపీఎంలు
తాండూరు రూరల్: తాండూరు మండల నూతన ఏపీఏంగా బాలయ్యను జిల్లా అధికారులు నియమించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఐకేపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన ఏపీఏం ఆనంద్ బంట్వారం మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. మహిళ సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. అనంతరం ఏపీఎంను కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి నాగమ్మ, సీసీలు శంకర్, సంధ్య, ప్రభు, వెంకటయ్య, అరవింద్‌కుమార్, అనసూయ, అకౌంటెంట్ కవిత పాల్గొన్నారు.
కుల్కచర్ల ఏపీఎంగా శ్రీనివాస్‌రెడ్డి
కుల్కచర్ల: మహిళ సంఘాల ఉన్నతికి అధికారులు నిస్వార్థంగా పనిచేయాలని మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంతోష అన్నారు. సోమవారం కుల్కచర్ల నూతన ఏపీఎంగా శ్రీనివాస్‌రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న శోభ బదిలీపై దోమ మండలానికి కేటాయించగా.. పరిగి ఏపీఎంగా శ్రీనివాస్‌రెడ్డి కుల్కచర్లకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఏపీఎంను మహిళా సమాఖ్య అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీసీలు, వీబీకేలు తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో చేరిక..
యాలాల: ఐకేపీ ఏపీఎంగా శ్రీనివాస్ సోమవారం విధుల్లో చేరారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ప్రమీల జనగాం జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో ఆమె స్థానంలో చౌడాపూర్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను యాలాలకు కేటాయించారు. సో మవారం ఐకేపీ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఐకేపీ సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికారు.

బాధ్యతలు స్వీకరించిన ఏపీఎంలు

బాధ్యతలు స్వీకరించిన ఏపీఎంలు