
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తాండూరు రూరల్: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ నాయక్ అన్నారు. సోమవారం పెద్దేముల్ మండల కేంద్రంలో గ్రామానికి చెందిన 151 మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రేషన్‌కార్డు ఇచ్చిన దాఖాలలు లేవన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్, పీసీసీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, నాయకులు ప్రవీణ్ కుమార్, జితేందర్‌రెడ్డి, విద్యాసాగర్, ఆనంద్‌చారి, షబ్బీర్, నర్సింలు, ఫయాజ్, మల్లేశం, ఇక్బాల్, మినహాజ్, బుజ్జమ్మ, ఎర్రబాలప్ప, శంకర్‌నాయక్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
బొంరాస్‌పేట: ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన రేషన్‌కార్డులను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. బురాన్‌పూర్, తుంకిమెట్ల తదితర గ్రామాల్లో లబ్ధిదారులు కార్డులు అందుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్, కోస్గి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, గౌడ సంఘం మండల నాయకులు ప్రకాశ్‌గౌడ్, భీమయ్యగౌడ్, బాల్‌రాజ్‌గౌడ్ తదితరులున్నారు.
పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం