
రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
తుర్కయంజాల్: రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసమే సహకార సంఘాలు పనిచేస్తున్నాయని డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. మంగళవారం డీసీసీబీ చైర్మన్ అధ్యక్షతన తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 మంది సభ్యులను సంఘంలో నూతనంగా చేర్చుకున్నామని, 24 మంది రైతులకు రూ. 2.65 కోట్లు రుణాలను మంజూరు చేశామన్నారు. 2024–25 ఆర్ధిక సంవత్సరం ఆడిట్ సర్టిఫికెట్‌ను ఆమోదించడంతో పాటు, 2025–26 మే 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మూడు నెలల జమా ఖర్చులను ఆమోదించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, లక్ష్మమ్మ, సంజీవ రెడ్డి, యాదగిరి, ఎస్.లక్ష్మమ్మ, కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, సీఈఓ వై.రాందాసు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీబీ చైర్మన్ సత్తయ్య