
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
కొడంగల్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవీంద్రయాదవ్ సూచించారు. పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. కలెక్టర్, డీఎంహెచ్‌ఓ ఆదేశాల మేరకు హాస్టల్‌ను విజిట్ చేస్తున్నామన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. వంటశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దోమల నియంత్రణ మందును పిచికారీ చేయించారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగడిరాయిచూర్ పీహెచ్‌సీ డాక్టర్ బుష్రా ఫాతిమా, సబ్ యూనిట్ అధికారి పకీరప్ప, ఎస్‌ఓ స్రవంతి, డాక్టర్ మహేందర్, మధుసూదన్‌రెడ్డి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి
దుద్యాల్: వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రవీంద్రాయాదవ్ సూచించారు. హకీంపేట్ పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ వందనతో కలిసి సోమవారం చెట్టుపల్లితండాలోని కేజీబీవీని సందర్శించారు. విద్యార్థులకు సరైన భోజనం అందుతుందా.. లేదా? అని అడిగి తెలుసుకున్నారు. వంటశాల, స్టోర్ గదిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ డాక్టర్ సౌమ్య, ఏఎన్‌ఎం సహేదా, పాఠశాల ప్రత్యేక అధికారి రాధిక తదితరులు పాల్గొన్నారు.
వ్యాధుల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండండి
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్
రవీందర్‌యాదవ్
పలు హాస్టళ్లలో తనిఖీలు