
కాలనీల సమస్యలు పరిష్కరించండి
తాండూరు టౌన్: పట్టణ శివారులోని 8వ వార్డు పరిధిలో గల రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా కాలనీవాసులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. రెండు కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోలేక పోయాయన్నారు. కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కాలనీల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు.
సిట్ విచారణకు హాజరు
తాండూరు: పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్ జాదవ్ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న తన ఫోన్‌ను గత ప్రభుత్వ హయాంలో ట్యాప్ చేసి ఉంటారని పోలీసులకు తెలిపారు. సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు వెల్లడించారు.
అందుబాటులో
అన్ని ఎరువులు
ఏడీఏ రుద్రమూర్తి
తాండూరు రూరల్: నియోజకవర్గంలో ఎరువుల కొరత లేదని వ్యవసాయశాఖ తాండూరు ఏడీఏ రుద్రమూర్తి అన్నారు. మంగళవారం మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏడీఏ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 0మాట్లాడుతూ.. ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్, డీసీఎంఎస్, మన గ్రోమార్ దుకాణాల్లో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. వివిధ మండలాల్లో యూరియా అందుబాటులో ఉందన్నారు. పెద్దేముల్–58 మెట్రిక్ టన్నులు, బషీరాబాద్–125, తాండూరు–162, యాలాల్లో–93 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. యూరియా ఒక్క బస్తాకు రూ.267 మాత్రమే చెల్లించాలని రైతులకు సూచించారు. 90 మెట్రిక్ టన్నుల డీఏపీ కూడా అందుబాటులో ఉందన్నారు. బస్తా డీఏపీకి రూ.1,350 మాత్రమే చెల్లించాలని చెప్పారు. వర్షాకాలం సీజన్‌లో నియోజకవర్గంలో 1.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారన్నారు.
పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి
టీపీఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌గౌడ్
ఇబ్రహీంపట్నం: గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని టీపీఎస్‌ఏ(తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్) జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్ చేయబడిన కార్యదర్శులకు మొదటి నియామకమైన 2019 ఏప్రిల్ 11 నుంచి వర్తింపులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని, జిల్లాలో ఓపీఎస్ క్యాటగిరీలో విధులు నిర్వహిస్తున్న వారిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కన్వర్షన్ చేయాలని, పెండింగ్ జీతభత్యములు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు దేవేందర్, దీపిక, నయీం, గౌస్, నవీన్‌యాదవ్, శ్రీనివాస్, సురేందర్ పాల్గొన్నారు.
జీజేసీ ప్రిన్సిపాల్‌గా రమణకుమారి
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల(జీజేసీ) ప్రిన్సిపాల్‌గా రమణకుమారి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి ఇన్నాళ్లుగా ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తానన్నారు.

కాలనీల సమస్యలు పరిష్కరించండి

కాలనీల సమస్యలు పరిష్కరించండి

కాలనీల సమస్యలు పరిష్కరించండి