
సేవ చేయడం అదృష్టంగా భావించాలి
● రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి
కొడంగల్: ప్రజలకు సేవ చేయడంలోనే జీవితం సార్థకం అవుతుందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని కేఎస్‌వీ పంక్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ 37వ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో మెలగాలన్నారు. కొడంగల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌స్టాలేషన్ అధికారిగా జిల్లా పూర్వ గవర్నర్ నటరాజ్, ఇన్‌స్టాలేషన్ కమిటీ చైర్మన్‌గా ముద్దప్ప దేశ్‌ముఖ్, ఇండక్షన్ అధికారిగా మృత్యుంజయ వ్యవహరించారు. కార్యక్రమంలో కొడంగల్ లయన్స్ క్లబ్ సభ్యులు దాసప్ప యాదవ్, రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి దేశ్‌ముఖ్, శ్రీకిషన్‌రావు, శివకుమార్ గుప్త, శివరాజ్ పాటిల్, మిఠాయిరాజు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, మున్సిపల్ కార్మికులకు టార్పాలిన్లు పంపిణీ చేశారు.
నూతన కమిటీ ప్రమాణస్వీకారం
లయన్స్ క్లబ్ కమిటీ పట్టణ నూతన అధ్యక్షుడిగా మురహరి వశిష్ట, కార్యదర్శిగా వడ్డె భీంరాజు, కోశాధికారిగా వెంకట్‌రెడ్డి దేశ్‌ముఖ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.