వానల పలకరింపు | - | Sakshi
Sakshi News home page

వానల పలకరింపు

Jul 21 2025 8:07 AM | Updated on Jul 21 2025 8:07 AM

వానల

వానల పలకరింపు

సోమవారం శ్రీ 21 శ్రీ జూలై శ్రీ 2025

8లోu

వికారాబాద్‌లో కురుస్తున్న వర్షం

వికారాబాద్‌: గడిచిన మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వానలకు పంటలకు జీవం పోసినట్లయింది. ఈ సీజన్‌లో అత్యధిక వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. ఒకటి రెండు చోట్ల భారీగా వర్షాలు కురవగా మిగిలిన చోట్ల సాధారణ వర్షపాతం నమోదయింది. ఆదివారం సైతం జిల్లాలో ముసురు వానకురిసింది. వాగులు పారుతూ చెరువుల్లోకి నీరు చేరుతోంది. గడచిన మూడు రోజుల్లో అత్యధికంగా నవాబుపేటలో 98 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవగా తాండూరులో 65.6 మిల్లీమీటర్లు, ధారూరులో 49.2 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదయింది.

అప్రమత్తమైన అధికారులు

జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నెలకొన్న పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. గత అనుభవాల నేపథ్యంలో రెవెన్యూ పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. పలుసార్లు వరదల కారణంగా తీవ్రంగా ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కింది స్థాయి వరకు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ నారాయణరెడ్డి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 20 రోడ్ల పరిధిలో 26 చోట్ల ప్రమాద స్థలాలను గుర్తించారు. అన్ని చోట్ల రెవెన్యూ, పోలీసులు నిఘా ఉంచాలని కింది స్థాయి యంత్రాంగానికి సూచించారు. వానలు తగ్గే వరకు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1,179 చెరువులు, కుంటలు ప్రాజెక్టులుండగా వాటిలోకి నీరు చేరడం ప్రారంభమైంది. వికారాబాద్‌, తాండూరు, పరిగి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరి కాలనీలు మడుగులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ప్రస్తుతం వ్యాధులు ప్రబలే సీజన్‌ కావటంతో హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు, పాఠశాలల వార్డెన్‌లు, ప్రిన్సిపాల్స్‌, హెచ్‌ఎంలతో అధికారులు పరిస్థితిని సమీక్షించారు.

న్యూస్‌రీల్‌

ముందస్తుగా మురిపించిన వానలు ముఖం చాటేశాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలకు జీవం పోసినట్లయింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌, ఎస్పీ అధికారులను ఆదేశించారు.

మూడు రోజులుగా నమోదైన వర్షపాతం (మిల్లీ మీటర్లలో)

మండలం 18వ తేదీ 19వ తేదీ 20వ తేదీ స్టేటస్‌

మర్పల్లి 00 26 2.8 లోటు

మోమిన్‌పేట్‌ 3.3 39.9 42.9 లోటు

నవాబుపేట 1.1 98 2.5 నార్మల్‌

వికారాబాద్‌ 07 38.1 02 లోటు

పూడూరు 14.8 19.5 1.9 లోటు

పరిగి 21.3 5.6 16.6 నార్మల్‌

కుల్కచర్ల 8.6 0.7 00 లోటు

దోమ 18.3 17 28.3 నార్మల్‌

బొంరాస్‌పేట 6 15 10 నార్మల్‌

ధారూరు 2.3 49.2 1.9 నార్మల్‌

కోట్‌పల్లి 31.1 23 5.9 నార్మల్‌

బంట్వారం 1.2 12.6 9 లోటు

పెద్దేముల్‌ 00 35.3 00 లోటు

తాండూరు 1.9 65.6 00 నార్మల్‌

బషీరాబాద్‌ 13.4 26.9 00 లోటు

యాలాల 3.2 12.2 2.1 నార్మల్‌

కొడంగల్‌ 5.9 2.2 00 లోటు

దౌల్తాబాద్‌ 7.6 1.4 00 నార్మల్‌

చౌడాపూర్‌ 17.3 9.8 00 నార్మల్‌

దుద్యాల 10.3 2.5 00 లోటు

రైతుల్లో ఆనందం

వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటి వరకు పంటలకు సరిపడా వర్షం కురవలేదు. అప్పుడప్పుడు కురిసిన వర్షం ఏదో ఒక ప్రాంతానికే పరిమితమైంది. దీంతో మొక్కజొన్న తదితర పంటలు సగం మేర మొలకెత్తాయి. వర్షాలు కురవక కొన్ని చోట్ల పంటలు పాడవగా రేగడి పొలాల్లో కోలుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వరినాట్లు వేసుకునే సీజన్‌ ప్రారంభం కావటంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, కూరగాయలు, పసుపు తదితర పంటలకు జీవం పోసినట్లయింది. వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం పరిశీలిస్తే మొత్తం జిల్లా పరిధిలోని 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా తొమ్మిది మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తోంది.

మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు

పంటలకు జీవం

సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం

అధిక వర్షాల కారణంగా అప్రమత్తమైన అధికారులు

పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

వానల పలకరింపు1
1/1

వానల పలకరింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement